logo

పోస్టుమాస్టర్ ఇంట్లో బంగారం చోరీ


కామాక్షినగర్ సమీపంలో నివాసం ఉంటున్న పోస్టుమాస్టర్
వెంకటరమణ ఇంట్లో మూడు తులాల బంగారం చోరీ
జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటరమణ
గజపతినగరంలోని తన బంధువుల ఇంటికి ఈ
నెల 13న కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు.
ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని సోమవారం
ఉదయం 7గంటల సమయంలో పక్కింటి వారు చూసి
సమాచారం ఇచ్చారు. వెంకటరమణ వచ్చి చూసేసరికి
ఇంట్లో సామగ్రి చిందరవందరగా ఉంది. ఒకటో పట్టణ
పోలీసులు కేసు నమోదు చేశారు.

0
0 views